కలం, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారికి చెన్నైకి చెందిన ఓ భక్తుడు అపూర్వమైన కానుకను సమర్పించారు. సుమారు రూ.160 కోట్ల విలువ చేసే 121 కిలోల బంగారు ఆభరణాలను ఆయన విరాళంగా అందించారు.
స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించేందుకు వీలుగా 9 ప్రత్యేక సెట్లుగా ఈ ఆభరణాలను రూపొందించారు. వీటిలో కిరీటం, పాదుకలు, సాలగ్రామ హారాలతో సహా మొత్తం 45 రకాల (46 రకాల) ఆభరణాలు ఉన్నాయి. వీటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ట్రక్కు ద్వారా తిరుమలకు తరలించారు. ఈ బంగారు ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు అందజేశారు.
కాగా, సదరు దాత గతంలో కూడా శ్రీవారికి పలు భారీ విరాళాలు అందించారు. 2025 జనవరిలో రూ.6 కోట్ల నగదు, ఈ ఏడాది మే నెలలో ఒక ఎలక్ట్రిక్ బస్సును టీటీడీకి విరాళంగా సమర్పించి తన భక్తిని చాటుకున్నారు.

