కలం, వెబ్ డెస్క్: ఏపీ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు (AP High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసంది. పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలని దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. పులివెందుల చైర్మన్ ఎన్నికకు రీపోలింగ్ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు.. దానిని డిస్మిస్ చేసింది. దీంతో పులివెందుల మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది.
కాగా, పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో అధికార యంత్రాంగం రిగ్గింగ్ పాల్పడిందని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సోమవారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. రీపోలింగ్ పై ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అనుబంధ పిటిషన్ ను కొట్టివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

