కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి నియోజకవర్గం రాజంపేట్ మండలంలోని పెద్దాయిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి (Chandrashekhar Reddy) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాముఖ్యతపై అంబేద్కర్ చూపిన దారిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని, బలహీన వర్గాల అభివృద్ధి ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. యువత చదువు ద్వారా ఎదిగి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, నరేష్, ఉప సర్పంచ్, సౌందర్య, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మైలారం లింగం, మల్లయ్య, ఆకుల బాబు, గంగారాం, నరేందర్, సిద్ది రాములు, సాంబశివరాం, సాయిలు, పెద్దాయిపల్లి పాలకవర్గం సభ్యులు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Also: భారత 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అరోణ్యక్ ఘోష్ రికార్డు
Follow Us On: Sharechat

