కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), స్టార్ డైరెక్టర్ బాబీ (Bobby) కాంబినేషన్‌లో మరో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ‘మెగా 158’ (Mega 158) వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా అద్భుత విజయం సాధించింది. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
మాఫియా నేపధ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. యాక్షన్ తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషనల్ కంటెంట్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాకు ‘కాకాజీ’ అనే పవర్ఫుల్ టైటిల్ ఫైనలైజ్ చేసినట్లుగా తెలుస్తుంది. త్వరలో మేకర్స్ ఆఫీషియల్‌గా టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ సైతం డిఫరెంట్‌గా ఉండనున్నట్లు సమాచారం. కేవీఏన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది.
Read Also: భారత 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అరోణ్యక్ ఘోష్ రికార్డు
Follow Us On: Sharechat

