Mobile Popup Ad
Mobile Popup Ad

భారత 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అరోణ్యక్ ఘోష్ రికార్డు

కలం, స్పోర్ట్స్: ఇండియన్ చెన్‌లో మరో సంచలనం నమోదయింది. సరికొత్త గ్రాండ్ మాస్టర్ అవతరించాడు. కోల్‌కతాకు చెందిన 22 ఏళ్ల అరోణ్యక్ ఘోష్ (Aronyak Ghosh) ఆదివారం అధికారికంగా దేశపు 95వ గ్రాండ్‌మాస్టర్‌గా (India 95th Grandmaster) నిలిచారు. కష్టాలు ఎన్ని వచ్చినా తలుచుకుంటే గమ్యాన్ని అందుకోవడం అసాధ్యం కాదని నిరూపించాడు 22ఏళ్ల అరోణ్యక్ ఘోష్. స్పార్సర్ లేకపోయినా, ఆర్థిక సమస్యలు వచ్చినా.. తన గెలుపునే పెట్టుబడిగా పెట్టుకుంటూ భారతదేశపు 95వ గ్రాండ్ మాస్టర్‌గా నిలిచారు. బ్యాంకాక్‌లో జరిగిన 23వ బీసీసీ ఓపెన్ 2026లో అజేయంగా నిలిచి, తన మూడవ, చివరి జీఎం నార్మ్‌ను ఆయన సాధించారు.

నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఘనత దక్కడంతో ఆయన కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. అరోణ్యక్ నాలుగేళ్ల వయసులో తన తండ్రి పాత చెస్ బోర్డును కనుగొనడంతో ఈ ప్రయాణం మొదలైంది. ఆ ముక్కలతో ఆడుకుంటున్న కొడుకును చూసి తండ్రి మృణాల్ ఘోష్ ఆశ్చర్యపోయారు. అప్పటికప్పుడే కొడుకును గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. చిత్రం ఏమిటంటే, కొడుకు స్పూర్తితో తండ్రి కూడా ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారి ఫైడ్ (FIDE) రేటింగ్ సాధించారు.

అరోణ్యక్ (Aronyak Ghosh) ప్రయాణం అంత సులభంగా సాగలేదు. పేదరికం కారణంగా తండ్రి తన ఆస్తులను అమ్మి మరీ టోర్నమెంట్లకు పంపేవారు. కార్పొరేట్ స్పాన్సర్లు లేకపోవడంతో, ఒక టోర్నమెంట్‌లో గెలిచిన ప్రైజ్ మనీతోనే తదుపరి టోర్నమెంట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఓడిపోతే ఆట ఆగిపోతుందనే ఒత్తిడిలోనూ అరోణ్యక్ (Aronyak Ghosh) అద్భుతంగా రాణించారు. 2022లో మొదటి నార్మ్ సాధించిన అరోణ్యక్, 2024లో ఫ్రాన్స్‌లో రెండో నార్మ్ అందుకున్నారు.

బ్యాంకాక్‌లో 9 రౌండ్లలో 7 పాయింట్లు సాధించి 2584 పెర్ఫార్మెన్స్ రేటింగ్‌తో చివరి మెట్టును అధిగమించారు. ప్రస్తుతం ఈస్టర్న్ రైల్వేలో ఉద్యోగం చేస్తూనే చెస్‌లో రాణిస్తున్న అరోణ్యక్, ఇటీవల నేషనల్ ర్యాపిడ్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకున్నారు. కుటుంబం చేసిన త్యాగాలు, శిక్షకుడు సౌమెన్ మజుందార్ అందించిన ఉచిత శిక్షణ అరోణ్యక్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. చదరంగమే ప్రాణంగా భావించే అరోణ్యక్, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని క్రీడా ప్రపంచం కోరుకుంటోంది.

Read Also: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కలెక్టర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>