కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఈరోజు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు పనులపై ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
వెలిగొండ ప్రాజెక్టు పరిశీలన తర్వాత ముఖ్యమంత్రి గిద్దలూరుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘సంజీవని’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కృష్ణంశెట్టిపల్లిలో సంజీవని పథకం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రాబోయే ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ‘సంజీవని’ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు.

