Mobile Popup Ad
Mobile Popup Ad

వైభవంగా ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం..

కలం, వెబ్​ డెస్క్ : ఆంధ్రప్రదేశ్​ కడప జిల్లా ఒంటిమిట్ట (Vontimitta) లోని శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు (బుధవారం) రామయ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభంగా నిర్వహించారు. పండు వెన్నెల్లో జరిగిన సీతారాముల కళ్యాణానికి ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులతో కలిసి వారు రామయ్య కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం పులకించిపోయింది. కాగా, ఈ నెల 5వ తేదీ వరకు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>