Mobile Popup Ad
Mobile Popup Ad

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చైన్ స్నాచింగ్

కలం, వెబ్ డెస్క్ : మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల (Jadcherla)లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. కిష్టారెడ్డి నగర్ కాలనీలోని ఓ కిరాణా దుకాణం వద్దకు ముగ్గురు అనుమానితులు వచ్చారు. వారిలో ఇద్దరు బైక్‌పై బయట వేచి ఉండగా, మరో వ్యక్తి వాటర్ బాటిల్ కొనుగోలు చేసే నెపంతో షాపులోకి వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళను గమనించిన నిందితుడు, సరైన సమయం చూసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని బయటకు పరుగెత్తాడు. వెంటనే బైక్‌పై ఉన్న తన సహచరులతో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>