Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మ‌ల్‌లో చైన్ స్నాచింగ్ క‌ల‌క‌లం!

క‌లం, నిర్మ‌ల్‌: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని వివేక్ నగర్‌లో సోమవారం దుండ‌గులు చైన్ స్నాచింగ్‌ (Chain Snatching)కి పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు తన మనవరాలిని జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్‌లో దింపేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమెను గమనించిన గుర్తు తెలియని ఇద్దరు దుండగులు పల్సర్ బైక్‌పై వచ్చి, వృద్ధురాలి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర ఆందోళ‌న చెల‌రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>