పెళ్లి ఖర్చు రూ.20 లక్షలా.. నెట్టింట చర్చ!

కలం, వెబ్ డెస్క్: జీవితంలో మధురానుభూతిని మిగిల్చే వేడుకల్లో పెళ్లి (Wedding)  ఒకటి. అందుకే, చాలా మంది రూ.కోట్లు వెచ్చించి మరీ భారీ స్థాయిలో జరుపుకుంటుంటారు. మరికొందరైతే.. తమ తాహతుకి మించి అప్పులు చేసి మరీ రూ.లక్షలు ఖర్చు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఛార్టెర్డ్ అకౌంటెంట్ మీనా గోయల్ పెట్టిన పోస్ట్ వైరలవుతోంది. నెటిజన్లను ఆలోచింపజేసేలా చేస్తోంది.

ఇంత ఖర్చు అవసరమా..?

మీనా గోయల్ చేసిన పోస్టులో ఈ రోజుల్లో సాధారణ పెళ్లికి ఎంత ఖర్చవుతుందనేది అంచనా వేశారు. పెళ్లి వేదికకు రూ.5 లక్షలు, డెకరేషన్, ఇతర హంగుల కోసం రూ.3 లక్షలు, భోజనాలకు రూ.6 లక్షలు, ఫొటోగ్రఫీకి రూ.2 లక్షలు, పెళ్లికి ముందు, తరువాత వినోద కార్యక్రమాల కోసం రూ.4 లక్షలు.. ఇలా మొత్తం కలిసి రూ.20 లక్షల వరకు ఖర్చవుతోందని తెలిపారు. కొన్ని గంటల్లో జరిగిపోయే కార్యక్రమానికి ఈ స్థాయిలో ఖర్చు చేయడం అవసరమా.. అని ప్రశ్నించారు.

ఆర్థిక భారమే మిగులుతుంది..

మీనా గోయల్ పెట్టిన పోస్టులో మరో ఆసక్తికరమైన అంశం అందరినీ ఆకట్టుకుంటోంది. పెళ్లికి వాడిన పూలను పారేస్తారు. మిగిలిన ఆహారాన్ని పడేస్తారు. వచ్చిన చుట్టాలందరూ వెళ్లిపోతారు. ఇంత ఖర్చు చేసినందుకు ఆర్థిక భారం మాత్రం మనకే మిగులుతుంది.

అందుకే, ఎవరూ తమ స్థోమతకు మించి ఖర్చు చేసుకోవద్దని.. చాలా సింపుల్‌గా, ఆడంబరాలకు వెళ్లకుండా నిర్వహించుకోవడమే మేలని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. మీనా గోయల్‌తో చాలా మంది నెటిజన్లు ఏకీభవిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>