గుడ్‌న్యూస్.. అమరావతికి కేంద్ర ప్రభుత్వ కీలక ప్రాజెక్టు మంజూరు

కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టును మంజూరు చేసింది. అమరావతిలో 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి (Central Secretariat Project) రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను కేంద్ర కేబినెట్ ఆమోదానికి సీపీడబ్ల్యూడీ పంపించింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ.1,299.08 కోట్లతో ప్రాజెక్టు డీపీఆర్ తాయారు చేశారు. ఇందులో కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాలకు రూ. 1,234.91 కోట్లతో ప్రాజెక్టును ప్రభుత్వం రూపకల్పన చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ లో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు కొలువుదీరనున్నాయి. కాగా, ఇటీవలే లోక్ సభ, రాజ్య సభ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Read Also: సెలూన్ షాప్‌కు రూ.72 లక్షల జీఎస్టీ నోటీసులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>