హీరోల కోసం గాయపడితే నష్టపోయేది మీరే.. ఫ్యాన్స్‌కు రజినీకాంత్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమాన హీరోల కోసం ప్రమాదకరమైన పనులు చేసే అభిమానులకు సూపర్ స్టార్ హెచ్చరించారు. నటీనటుల మీద ఇష్టంతో తమను తాము గాయపరుచుకుంటే, ఆ బాధను అనుభవించేది కేవలం అభిమానులేనని స్పష్టం చేశారు. రాజకీయ ప్రచారాల్లో అభిమాన నటులను కలిసే క్రమంలో యువత (Youth) వాహనాలకు అడ్డంగా వెళ్లడం, తోపులాటల్లో చిక్కుకోవడం లాంటివి సరికాదన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రాణాపాయం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

యువత తమ జీవితంలో కీలకమైన విద్యార్థి దశను వృధా చేసుకోకూడదని, చదువుపైనే పూర్తి దృష్టి సారించాలని రజనీకాంత్ సూచించారు. ఈ వయస్సులో చదువును నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. అలాగే మాదకద్రవ్యాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, అవి కేవలం వ్యక్తిని మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రుల జీవితాలను కూడా నరకప్రాయం చేస్తాయని హితవు పలికారు. అభిమానం ఉండాలి కానీ అది ప్రాణాల మీదకు రాకూడదని రజినీకాంత్ (Rajinikanth) అభిమానులను కోరారు.

Read Also: పశ్చిమాసియాలో యుద్ధ స్థితిపై కేంద్రం కీలక ప్రకటన!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>