Mobile Popup Ad
Mobile Popup Ad

రైల్వే బ్రిడ్జి పనుల్లో జారిపడ్డ కార్మికులు.. పరిస్థితి విషమం..!

కలం, వెబ్ డెస్క్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ (Kagaznagar) వద్ద ప్రమాదం జరిగింది. పెద్దవాగుపై కొత్తగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి పనులు కొనసాగుతుండగా.. ఒక్కసారిగా ముగ్గురు కార్మికులు జారిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక కార్మికుడు శిథిలాల కింద ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు కార్మికులను స్థానికులు , తోటి కార్మికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైద్యులు స్పాట్ కు చేరుకుని బ్రిడ్జ్ శిథిలాల కింద ఉన్న వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు.

కాగా, సదరు కార్మికుడికి తీవ్ర రక్తస్రావం జరిగి, శరీర భాగాలు నలిగిపోయినట్లు తెలుస్తోంది. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. పెద్దవాగుపై మూడో రైల్వే లైన్ నిర్మాణం కోసం కొత్త వంతెన నిర్మాణం చేపట్టగా ఈ ఘటన చోటు చేసుకోగా.. రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని.. సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం పై విచారణ చేస్తున్నారు.

Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>