ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త

కలం, వెబ్ డెస్క్: ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. విశాఖపట్నం సమీపంలోని భోగాపురం(Bhogapuram)లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి అధికారిక గుర్తింపు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇక నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ విభాగంలోకి రానుంది. దీంతో, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు మార్గం సుగుమం అయింది. కేటగిరీ-1 విమానాశ్రయాల్లో భోగాపురం 39వ స్థానంలో చేర్చుతూ కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు.

త్వరలోనే ప్రధానితో ప్రారంభోత్సవం..

భోగాపురంలో నిర్మితమవుతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు చివరి దశకు వచ్చాయి. అతి త్వరలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధతో పనులు జరుగుతున్నాయి. ఇటీవలే ఏరో డ్రోమ్స్ లైసెన్స్ కూడా మంజూరైంది. దీని రన్ వే సుమారు 3.8 కిలోమీటర్లు కావడం గమనార్హం.

ఏడాదికి సుమారు 60 లక్షల మంది ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయితే.. ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్ గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>