కలం, వెబ్ డెస్క్: భారత నూతన ఆర్మీ చీఫ్‌గా (New Army Chief ) లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను (Dhiraj Seth) కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనుండగా.. అదే రోజు మధ్యాహ్నం ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆర్మీకి వైస్ చీఫ్‌గా ఉన్న ఆయన.. జనరల్ హోదాలో సైన్యాధిపతిగా పనిచేయబోతున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన ధీరజ్ సేథ్.. 40 ఏళ్లుగా సైన్యంలో వివిధ హోదాల్లో పని చేస్తూ వస్తున్నారు. కమాండింగ్ అధికారిగా, యుద్ధ వ్యూహాల నిపుణుడిగా, పలు ఆపరేషన్లలో అత్యంత కీలక పాత్ర పోషించారు.
Read Also: రాజ్యసభలో బలం కోసమే బీజేపీ కుట్ర: టీపీసీసీ చీఫ్ మహేశ్
Follow Us On: X(Twitter)

