Mobile Popup Ad
Mobile Popup Ad

సీబీఎస్‌ఈలో త్రిభాషా విధానంపై కేంద్రం యూటర్న్

కలం, వెబ్ డెస్క్ : కేంద్రం ఇటీవల సీబీఎస్ఈ (CBSE ) విద్యార్థులకు తీసుకొచ్చిన త్రిభాషా విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం 9వ తరగతి విద్యార్థులకు త్రిభాష విధానంలో ఒక విదేశీ భాషను మాత్రమే ఎంచుకోవాల్సి ఉండడంపై విద్యార్థులు, పేరెంట్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎనిమిదో తరగతి వరకు చదివిన రెండు విదేశీ భాషల్లో ఒకటి వృథా అవుతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విధానంపై తాజాగా కేంద్రం యూటర్న్ తీసుకుంది.

ప్రస్తుతం 7-9 వరకు చదువుతున్న విద్యార్థుల్లో రెండు విదేశీ భాషలు చదువుకున్న వారు ఉంటే.. వారు పదో తరగతి వచ్చే వరకు కూడా అదే పద్ధతిలో రెండు విదేశీ భాషల్ని చదువుకోవచ్చని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. ఈ మేరకు వారు ఒక భారతీయ భాషతో పాటు ఇప్పటికే అభ్యసిస్తున్న విదేశీ భాషలను రెండు సబ్జెక్టులుగా కొనసాగించవచ్చని ఓ ప్రకటన విడుదల చేసింది. సీబీఎస్‌ఈ బోర్డు తీసుకున్న తాజా నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులకు మేలు జరగనుంది.

కాగా, గతంలో అమలైన విధానం ప్రకారం సీబీఎస్ఈ విద్యార్థులు రెండు విదేశీ భాషలను ఎంచుకునే సౌకర్యం ఉండేది. భారతీయ భాష తప్పనిసరి కాదు. దీంతో కొందరు విద్యార్థులు రెండు కూడా విదేశీ భాషల్నే ఎంచుకున్నారు. అయితే సీబీఎస్‌ఈ బోర్డు కొత్తగా తెచ్చిన త్రిభాషా విధానం ప్రకారం ప్రస్తుతం తొమ్మిదో తరగతి విద్యార్థులు ఏదైనా ఒక్క విదేశీ భాషను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రెండు భారతీయ భాషలు చదవాలి. దీంతో గతంలో వారు చదివిన రెండు విదేశీ భాషల్లో ఒకటి వృథా అవుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చిన విమర్శలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>