Mobile Popup Ad
Mobile Popup Ad

CBSE 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

కలం, వెబ్​ డెస్క్​ : సీబీఎస్ఈ (CBSE) పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయంలో భాగంగా, రెండో విడత పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. మే 15వ తేదీన ప్రారంభం కానున్న ఈ పరీక్షలు మే 21వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇదే సమయంలో ఇంప్రూవ్‌మెంట్, కంపార్ట్‌మెంట్ రాసే విద్యార్థులకు మే 30 వరకు పరీక్షలు జరుగుతాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి 17న ప్రధాన వార్షిక పరీక్షలు ప్రారంభం కాగా, ఇప్పుడు రెండో విడత పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ఫలితాలను జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. విద్యార్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>