epaper
Monday, March 2, 2026
epaper

టీవీకే అధినేత విజయ్ కు సీబీఐ నోటీసులు

కలం, వెబ్ డెస్క్ : హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ (Vijay) కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న మరోసారి విచారణకు రావాలని సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 2025 సెప్టెంబర్ 17న కరూర్ లో విజయ్ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో (Karur Stampede Case) 41 మంది చనిపోవడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన మీద జనవరి 12న విజయ్ ను 7 గంటల పాటు ఢిల్లీలోని సీబీఐ హెడ్ ఆఫీస్ లో అధికారులు ప్రశ్నించారు. తొక్కిసలాటకు సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టాలనే ఉద్దేశంతో విజయ్ ను మరోసారి విచారించాలని సీబీఐ నిర్ణయించింది.

సంక్రాంతి తర్వాత విచారణకు వస్తానని విజయ్ కోరడంతో.. ఈ నెల 19న రావాలంటూ నోటీసుల్లో సీబీఐ అధికారులు తెలిపారు. విజయ్ ను మరోసారి విచారణకు పిలవడం చర్చనీయాంశంగా మారింది. కరూర్ లో టీవీకే పార్టీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో (Karur Stampede Case) 41 మంది ప్రాణాలు కోల్పోగా.. 110 మంది గాయపడ్డారు. ఆ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకు అప్పగించిన సంగతి తెలిసిందే.

Read Also: టెకీలకు టీసీఎస్ మరో షాక్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!