కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు (CBI Court) అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్లేందుకు న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ వరకు జగన్ యూరప్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దేశం విడిచి వెళ్లే ముందు సీబీఐ అధికారులకు వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీతో పాటు తగిన ష్యూరిటీ సమర్పించాలని జగన్‌కు సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ సీఎం జగన్.. దేశం విడిచి వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి ఉండాలి. ఈ క్రమంలో గతంలో కూడా పలు మార్లు సీబీఐ కోర్టు అనుమతితో జగన్ (YS Jagan) విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Read Also: పాస్టర్ ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. 2.27 కోట్లు స్వాధీనం
Follow Us On : WhatsApp

