Mobile Popup Ad
Mobile Popup Ad

బైక్‌లోకి దూరిన నాగుపాము

కలం మెదక్ బ్యూరో: సాధారణంగా పాములు పుట్టల్లో ఉంటాయి. అప్పుడప్పుడూ ఇంటి పరిసరాల్లోకి వస్తుంటాయి. కానీ మెదక్ (Medak) జిల్లా కౌడిపల్లి మండలంలోని కుకుట్లపల్లి గ్రామంలో నాగు పాము ఏకంగా బైక్‌లో దూరి కలకలం సృష్టించింది. జంగా ప్రశాంత్‌కు చెందిన పల్సర్ బైకు ముందు భాగం డోన్‌‌లోకి నాగుపాము దూరింది. బుసలు కొడుతున్న శబ్దాలు వినిపిస్తుండడంతో ప్రశాంత్ కుటుంబ సభ్యులు బైక్ దగ్గరికి వచ్చి చూసి భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులతో కలిసి అరగంట పాటు నానా తిప్పలు పడి బైక్ డోన్‌లో దూరిన నాగుపామును బయటికి రప్పించారు. ముందుగా గమనించడంతో పెనుప్రమాదం తప్పిందని వారు ఊపిరిపీల్చుకున్నారు.

Read Also: మహిళా బిల్లుతోనైనా ఆ మూడు పార్టీల‌ మనసు మారేనా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>