Mobile Popup Ad
Mobile Popup Ad

పాస్టర్ ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. 2.27 కోట్లు స్వాధీనం

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. పాస్టర్‌ (Pastor) గంటా జాన్‌ బాబూరావు నివాసంలో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. లెక్కల్లో లేని రూ. 2.27 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా బాబూరావు కుటుంబం పెద్దఎత్తున ఆస్తులు కొనుగోలు చేస్తూ, విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టి దాడులు చేశారు. ఈ భారీ మొత్తానికి సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఉన్న ఆర్థిక మూలాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>