అన్నదానంలో కుల వివక్ష.. వేర్వేరుగా వ‌డ్డింపులు!

క‌లం, వెబ్‌డెస్క్‌: సిద్ధిపేట‌ (Siddipet)లో ఓ వినాయ‌క మండ‌పం వ‌ద్ద ఏర్పాటు చేసిన అన్న‌దాన కార్య‌క్ర‌మంలో కుల వివ‌క్ష (Caste Discrimination) చూప‌డం సోష‌ల్ మీడియాలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌ట్ట‌ణంలోని ఇమామ్‌బాద్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌నపై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స్థానికంగా వినాయ‌కుడిని ప్ర‌తిష్టించిన నిర్వాహ‌కులు అన్న‌దానం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి, అగ్ర‌కులాల వారికి దూరం దూరంగా వేర్వేరు టేబుల్స్ వేసి భోజ‌నాలు వ‌డ్డించారు.

ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన స్థానిక యువ‌కుడు నిర్వాహ‌కుల‌ను ప్ర‌శ్నించాడు. ఎస్సీల‌కు వేర్వేరుగా ఎందుకు టేబుల్స్ వేశార‌ని నిల‌దీశాడు. క్యూలో పేట్లు ప‌ట్టుకొని నిల్చున్న వారికి భోజ‌నాలు చేయ‌వ‌ద్ద‌ని చెప్పాడు. ఇలా కుల వివ‌క్ష చూపుతూ వేర్వేరుగా భోజ‌నాలు వ‌డ్డించ‌డం స‌రైన‌దేనా అని అక్క‌డున్న వారిని ఒక్కొక్క‌రిని ప్ర‌శ్నిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. కొంద‌రు యువ‌కుడి ప్ర‌శ్న‌కు స‌రికాద‌ని చెప్పారు. మ‌రికొంద‌రు ఇప్పుడు వ‌డ్డిస్తే ఏమైందంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కొంద‌రు మ‌హిళ‌లు యువ‌కుడితో వాగ్వాదానికి దిగారు.

త‌మ చిన్న‌ప్ప‌టి నుంచి ఇలాగే వేర్వేరుగా వ‌డ్డిస్తున్నార‌ని, దీనికే వీడియోలు, ఫోటోలు తీసి ఎందుకు రాద్దాంతం చేస్తున్నావ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే తాము చేస్తున్న‌ది స‌రైన‌దే అని చెప్తే వీడియో తీయ‌డం ఆపేస్తాన‌ని యువ‌కుడు చెప్పాడు. అగ్ర కుల‌స్తుల‌ను ఎస్సీల కోసం ఏర్పాటు చేసిన టేబుల్స్ వ‌ద్ద‌కు వెళ్లి భోజ‌నం చేయాల‌ని చెప్పాడు. దీనికి వారు నిరాక‌రించారు. యువ‌కుడు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కొంద‌రు వ‌డ్డింపుల తీరును స‌మ‌ర్థించగా మ‌రికొంద‌రు స‌రికాద‌ని చెప్పారు. కొంద‌రు తాము కూడా ఎస్సీల కోసం ఏర్పాటు చేసిన టేబుల్స్ వ‌ద్ద భోజ‌నం చేస్తామ‌ని ముందుకొచ్చారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కాలంలో కూడా కుల వివ‌క్ష ఏమిట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>