కాషాయమయమైన నిర్మల్.. రేపు వినాయక నిమజ్జనం

కలం, నిర్మల్: వినాయక నిమజ్జన శోభాయాత్రకు (Ganesh Immersion) నిర్మల్ పట్టణం ముస్తాబైంది. శుక్రవారం నిర్వహించనున్న నిమజ్జనాన్ని పురస్కరించుకుని గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలోని ప్రధాన వీధులను కాషాయ తోరణాలు, జెండాలతో అలంకరించడంతో నిర్మల్ నగరం కాషాయమయంగా కనిపిస్తోంది. నగరేశ్వరవాడ శివాలయం వద్ద ప్రత్యేకంగా స్వాగత వేదికను ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ సమితి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు బుధవార్‌పేట్ (Budhwarpet) ఏక్ నంబర్ వినాయకుడి వద్ద బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా శోభాయాత్ర కొనసాగించి నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>