కులగణన చేస్తే తప్పేంటి..? : సుప్రీంకోర్టు

కలం, వెబ్ డెస్క్ : కులగణన (Caste Census) ప్రభుత్వం తీసుకునే పాలసీ నిర్ణయమని, ఇందులో జోక్యం చేసుకోడానికి కోర్టులకు అధికారం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. జనగణనలో కులగణన చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. వెనకబడిన కులాల జనాభా తెలిసినప్పుడే వారి సామాజిక, ఆర్థిక వెనకబాటుతనంపై స్పష్ట వస్తుందని, దానికి తగినట్లుగా ఎలాంటి సంక్షేమాన్ని అందించాలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోగలుగుతాయని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రభుత్వాలకు ఏ సెక్షన్ జనాభా ఎంత ఉన్నదో, ఎలాంటి వెనకబాటుతనం ఉన్నదో తెలియాల్సి ఉంటుందని స్పష్టత ఇచ్చింది. జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేయాలన్న నిర్ణయాన్ని కోర్టులు తప్పుపట్టలేవని, జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. కులగణన చేపట్టవద్దని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>