Mobile Popup Ad
Mobile Popup Ad

కవిత సహా 43 మందిపై కేసు నమోదు

కలం/ఖమ్మం : బ్యూరో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో (Kavitha) సహా 43 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వెలుగుమట్ల నిర్వాసితులతో రోడ్డుపై ధర్నా చేసి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజు, జాగృతి అధ్యక్షురాలు కవితతో (Kavitha) పాటు 43 మందిపై ఖమ్మం వన్ టౌన్ పీఎస్ లో కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు.

ఈ 43 మందిలో 33 మంది నిజామాబాద్, వనపర్తి, నల్గొండ, కామారెడ్డి, హన్మకొండ, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల నుండి వచ్చారని ఏసీపీ వెల్లడించారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ ఆవరణంలో వున్న బాధితులను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని ఏసీపీ పేర్కొన్నారు. అదేవిదంగా కొంతమంది భూ నిర్వాసితులు విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్ సిబ్బందిపై దాడులు చేశారని, వీడియో ఫుటేజ్ పరిశీలించిన అనంతరం వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొంతమంది అనవసరంగా రెచ్చగొట్టే మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>