epaper
Wednesday, February 18, 2026
epaper

జగ్గారెడ్డిపై కేసు నమోదు

కలం, వెబ్​ డెస్క్​ : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy)పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన విధులకు ఆటంకం కలిగించారని ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారి వినయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జగ్గారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి జగ్గారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 223, 351, 352, 132, 329, 191(2) సెక్షన్లతో పాటు 215(1)(b) సెక్షన్ల కింద ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో జగ్గారెడ్డి (Jagga Reddy)ని మొదటి నిందితుడిగా (A1) పేర్కొనగా, అడ్డు అలియాస్ హమీద్‌ను రెండో నిందితుడిగా (A2) పోలీసులు చేర్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>