భద్రాచలం ఆస్పత్రిలో అరుదైన ప్రసవం.. ఐదు కిలోల బరువుతో మగబిడ్డ జననం

కలం, వెబ్ డెస్క్: భద్రాచలం (Bhadrachalam) ఏరియా ఆస్పత్రిలో అరుదైన ప్రసవం జరిగింది. సంధ్యారాణి అనే మహిళ దాదాపు 5.2 కిలోల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా పుట్టిన పిల్లలు 2.5 నుంచి 3.5 కిలోల బరువు మాత్రమే ఉంటారు. కానీ ఈ శిశువు అంతకంటే చాలా ఎక్కువ బరువు ఉండటంతో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించారు.

భారీ బరువుతో శిశువు (Baby Boy) జన్మించడానికి గల కారణాలను వైద్యులు గుర్తించారు. గర్భధారణ సమయంలో తల్లికి మధుమేహం ఉండటం, తల్లిదండ్రుల శారీర నిర్మాణం లాంటివి జన్యుపరమైన కారణాలుగా గుర్తించారు. అలాగే ప్రసవ గడువు దాటిపోవడం కూడా శిశువు బరువు పెరగడానికి దోహదం చేస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రసవం కష్టంగా ఉంటుంది. కానీ వైద్యుల సమర్థవంతమైన పర్యవేక్షణలో ప్రసవం సేఫ్‌గా జరిగింది.

ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఈ ఘటన గురించి చాలామందికి తెలియడంతో ఆ చిన్నారి చూసిన స్థానికులు బాల భీముడు అని పిలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి చరిత్రలో ఇది అరుదైన ఘట్టంగా నిలిచిపోయిందంటున్నారు.

Read Also: నిఫా డేంజర్​ బెల్స్​.. బెంగాల్​లో నర్స్​ మృతి​

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>