కష్టకాలంలో హనుమాన్ చాలీసా చదివా: ప్రధాని మోదీతో కెప్టెన్ స్మిత్

కలం, వెబ్ డెస్క్ : ఫ్లైదుబాయ్ విమాన అత్యవసర పరిస్థితి సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారతీయుడు కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ (Captain Smit) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తో వీడియో కాల్ లో మాట్లాడారు. సంభాషణ సమయంలో కెప్టెన్ స్మిత్ భావోద్వేగానికి లోనయ్యారు. విమానంలో ప్రమాదకర వాతావరణం నెలకొన్నప్పుడు తాను హనుమాన్ చాలీసా జపించానని, కష్ట సమయాల్లో ఎప్పుడైనా హనుమాన్ చాలీసా పఠించడం తన అలవాటని తెలిపారు. తీవ్ర గాయాలైనప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా, విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను రక్షించేందుకు కాక్ పిట్ తలుపు తెరిచానని చెప్పారు. ప్రధాని మోదీని తన అతిపెద్ద ఆదర్శంగా అభివర్ణించిన స్మిత్, ఆయనతో మాట్లాడటం ఎంతో ప్రత్యేకమైన క్షణమని పేర్కొన్నారు.

కెప్టెన్ స్మిత్ సమయస్ఫూర్తి, సాహసాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. దేశం మొత్తం మీ ఆరోగ్యం కోసం, త్వరగా కోలుకోవాలని మహా మృత్యుంజయ జపం చేస్తూ ప్రార్థిస్తోందని అన్నారు. భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కాదని, ఇతరులను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టే వారని గర్వంగా చెప్పవచ్చని ప్రధాని స్పష్టం చేశారు. కెప్టెన్ స్మిత్ తల్లి గీతా బెన్ ఆయనను భగవద్గీత విలువలతో పెంచారని ప్రధాని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>