Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేసిన బీఆర్ఎస్: జూపల్లి

కలం, వెబ్ డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసెంబ్లీ వేదికగా మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే.. పదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఫైర్ అయ్యారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చేనాటికి ఎక్సైజ్‌శాఖ ఆదాయం రూ.10 వేల కోట్లు లోపు ఉండేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ (BRS) దిగిపోయే నాటికి ఎక్సైజ్‌శాఖ ఆదాయం రూ.36 వేల కోట్లకు పెరిగిందన్నారు.

ఈ రెండున్నరేళ్లలో ఎక్సైజ్‌శాఖ ఆదాయం దాదాపు రూ.2 వేల కోట్లు తగ్గిందని చెప్పారు. మద్యాన్ని ప్రోత్సహించిందెవరు? ప్రజలను తాగుబోతులుగా మార్చిందెవరు? అంటూ దుయ్యబట్టారు. 60 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.65 వేల కోట్లకు మించి పోలేదని.. బీఆర్‌ఎస్‌ దిగిపోయేనాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.8 లక్షల కోట్లకు పెరిగిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ పథకాలు సజావుగా ముందుకు సాగుతున్నాయని మంత్రి జూపల్లి (Jupally) చెప్పారు.

Read Also: దేవాదుల పనులకు 1000 కోట్లు కేటాయించాలి: కడియం శ్రీహరి

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>