కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాల తొలి రోజే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తన చీర లాగేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) కన్నీరు పెట్టడం సంచలనంగా మారింది. మహిళా సభ్యుల పట్ల కనీసం గౌరవం లేకుండా పోలీసులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలతో ఎలా ప్రవర్తించాలో తెలియదా.. అని ఫైర్ అయ్యారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
అంతకుముందు హరీశ్ రావు, కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లటి టీ షర్టులు ధరించి సభ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. తోపులాట జరగడంతో కొందరు ఎమ్మెల్యేలు కింద పడిపోయారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
Also Read : అసెంబ్లీ వద్ద హై టెన్షన్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాయాలు..!
Follow Us On: X(Twitter)

