కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వర్షాకాల సమావేశాల వేళ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్ల టీషర్టులతో లోపలికి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో టీషర్ట్ విప్పేసి బీఆర్ఎస్ సభ్యుల నిరసన తెలపడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో తోపులాట జరిగింది.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy)తో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాయాలయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జగదీష్ రెడ్డి కాలికి తీవ్ర గాయం అయింది. ఈ పరిణామంపై జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. అంతకుముందు పోలీసుల తీరుకు నిరసనగా టీషర్ట్‌లు విప్పి నిరసన తెలిపిన హరీశ్‌రావు (Harish Rao) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంతకాలం రాజ్యం చేస్తావ్ రేవంత్ రెడ్డి? ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ నడుపుతారా? ఇదేం ప్రజా పాలన? ప్రతిపక్షాన్ని ఎదుర్కునే ధైర్యం లేకపోతే.. అసెంబ్లీ(Telangana Assembly)కి ఎందుకు పిలిచారు? అంటూ తనను అరెస్ట్ చేసిన నేపథ్యంలో హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.
Also Read : చీర లాగేశారని మహిళా ఎమ్మెల్యే కన్నీరు!
Follow Us On: X(Twitter)

