Mobile Popup Ad
Mobile Popup Ad

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) స‌మావేశాలు మూడో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ ప్ర‌శ్నోత్త‌రాలు ప్రారంభించారు. స‌భ మొద‌లైన‌ కొద్ది సేప‌టికే బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు స‌భ నుంచి వాకౌట్ చేశారు. మూసీపై ప్ర‌భుత్వ‌ స‌మాధానం ప‌ట్ల బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. మూసీపై ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌రైన డీపీఆర్ లేద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. మూసీ ప్ర‌క్షాళ‌న‌పై (Musi Rejuvenation) ప్ర‌భుత్వం చెప్పేది ఒక‌ట‌ని, చేస్తున్న‌ది ఒక‌ట‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర పైస‌లు లేవ‌ని, ప్ర‌ణాళిక లేద‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా వాకౌట్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వ‌మే డీపీఆర్ లేద‌ని చెప్తోంద‌ని కేటీఆర్ అన్నారు. డీపీఆర్ ఉంటే టేబుల్ చేయాల‌న్నారు. 50 మీట‌ర్ల బ‌ఫ‌ర్ జోన్ జీవో ఇచ్చిన‌ట్లు చెప్పార‌ని, 5 కిలో మీట‌ర్ల అవ‌త‌ల ఉండే హ‌నుమాన్ న‌గ‌ర్‌కి నోటీసులు ఇచ్చార‌ని చెప్పారు.మంత్రి స‌మాధానంలో 1450 స్ట్ర‌క్చ‌ర్స్ అంటార‌ని, అక్క‌డ చూస్తే 10 వేల స్ట్ర‌క్చ‌ర్స్ అని ప్ర‌భుత్వ‌మే గెజిట్ ఇచ్చింద‌న్నారు. డిప్యూటీ సీఎం పేద‌ల‌పై ప్రేమ ఒల‌క‌బోశార‌ని, సొంత జిల్లాలోనే వెలుగుమ‌ట్ల‌లో ఇండ్లు కూల‌గొట్టార‌ని విమ‌ర్శించారు. తాము మూసీకి వ్యతిరేకం కాదని, మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు.

Read Also: రాజకీయాలని కుదిపేస్తోన్న డ్రగ్స్ వివాదాలు

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>