ఆర్టీసీ డ్రైవర్‌ సస్పెన్షన్‌.. కరీంనగర్‌లో బీఆర్ఎస్ నేతల ఆందోళన

కలం, కరీంనగర్ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నించినందుకే జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ (RTC Driver) అశోక్‌ను ఉద్యోగం నుంచి తొలగించారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి విమర్శించారు. డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ గులాబీ శ్రేణులతో కలిసి ఆందోళనబాట పట్టారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ ఆర్ఎంకు వినతి పత్రాన్ని అందించారు. ప్రజా ప్రభుత్వమంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తోందన్నారు. సస్పెండ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌కు పార్టీ అండగా ఉంటుందన్నారు. డ్రైవర్ సస్పెన్షన్ ఎత్తివేసే వరకు అవసరమైతే ఆర్ఎం కార్యాలయం ముందు బైఠాయిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తాత్కాలిక డ్రైవర్‌గా ఉన్న అశోక్‌ను పర్మినెంట్ డ్రైవర్‌గా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>