కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: జడ్చర్ల పట్టణానికి చెందిన రాకేశ్, శ్రీలేఖ దంపతుల కుమారుడు ఇషాన్ అర్విక్ మెదడు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. నలభై ఐదు రోజులుగా గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇషాన్‌ను మంగళవారం మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి (Laxma Reddy) పరామర్శించి, తల్లితండ్రులను ఓదార్చారు. ఇషాన్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తల్లితండ్రులు తమ శక్తికి మించి, ఇప్పటికే ఖర్చు చేశారని వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. ట్రీట్‌మెంట్ గురించి అన్ని విధాల సహరించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు. చిన్నారి ఇషాన్ కోలుకొని త్వరగా డిశ్చార్జ్ అవుతాడని లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. ఇషాన్ తల్లితండ్రులు భయపడొద్దని భరోసా కల్పించారు.

