Mobile Popup Ad
Mobile Popup Ad

తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలి: మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం

కలం, చండూరు: అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న తహసీల్దార్ సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలని మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం (Karnati Venkatesham) కోరారు. సోమవారం కలెక్టర్ బడుగు చంద్రశేఖర్‌కు పిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గట్టుప్పల (Gatuppal) గ్రామంలో ప్రభుత్వ భూమికి ఆనుకొని ఉన్న సర్వే 2లో వ్యవసాయ భూమిని సర్వేయర్ బొడ్డుపల్లి అశోక్ తప్పుడు సర్వే రిపోర్టు ఇచ్చి సర్వే 2లో ఎ.0-30 గుంటలు మిగులు భూమి ఉన్నట్టుగా చూపించి తహసీల్దార్ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే అక్రమలకు పాల్పడుతున్నారని అన్నారు. గతంలో ఇట్టి భూమి సర్వేనెంబర్ 7 ప్రభుత్వ భూమి అయినప్పటికీ, ఇట్టి భూమిని తప్పుడు రిపోర్టుతో సర్వేనెంబర్ 2లో ఉన్నట్లుగా, మిగులు భూమిగా చూపించి తహసీల్దార్ సర్వేయర్ కుమ్మక్కై వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు సర్వే నిర్వహించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని అన్నారు. సర్వే నెంబర్ 158, 159లో వ్యవసాయ భూమిని ఇండ్ల ప్లాట్లుగా అమ్ముకోవడానికి అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేసి, నాలా ప్రొసీడింగ్స్ ఇచ్చిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>