కేసులు, జైళ్లు మాకు కొత్త కాదు : మాజీ ఎమ్మెల్యే ఆరూరి

కలం, వరంగల్ బ్యూరో : రైతుల తరఫున మాట్లాడిన కేటీఆర్ పై కేసులు పెడతారా? కేసులు, జైళ్లు తమకు కొత్త కాదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aroori Ramesh) అన్నారు. గురువారం హ‌నుమ‌కొండ బాల‌స‌ముద్రంలోని పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటికొండ రాజయ్యతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల స్థాయికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అవసరం లేదని తాము చాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల తరఫున అన్ని వర్గాల కోసం పోరాడుతున్నామన్నారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు రైతు బంధు పూర్తి స్థాయిలో ఇచ్చారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని ఆయన (Aroori Ramesh) ప్రశ్నించారు.

కేసీఆర్ రైతులు అడగకుండానే రైతు బంధు ఇచ్చారని, 50 ఏళ్ల క్రితం ఉన్నా దుష్ట కాంగ్రెస్ పాలనను మళ్లీ తీసుకొచ్చారని విమర్శించారు. కేసీఆర్ ను తిట్టొచ్చు కానీ.. ఇచ్చిన హామీలు అడిగితే బూతులు తిడతారా అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి పాలన పోయి రైతు బంధు కేసీఆర్ పాలన రావాలని రైతులు కోరుకుంటున్నారని తెలిపారు. ఇంకోసారి తమ నాయకుల పై నోరు జారితే క‌ఖబ‌డ్దార్‌ అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే నాగరాజు స్థాయికి మించి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి తాటికొండ రాజ‌య్య మాట్లాడుతూ తిట్ల పురాణానికి ఆధ్యుడు రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ పాలనలో కన్స్ట్రక్షన్ లేదు.. కేవలం డిస్ట్రక్షన్ మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి 69 సార్లు ఢిల్లీకి పోయి ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. రైతు బంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, దేశంలో వ్యవసాయాన్ని పండగలా మార్చింది కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణను తిరోగమానంలోకి తీసుకెళ్తున్నారని విమర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో కుడా మాజీ చైర్మ‌న్ మ‌ర్రి యాద‌వ రెడ్డి, మాజీ కార్పొరేట‌ర్ ఉడ‌త‌ల సారంగ‌పాణి, చింత‌ల యాద‌గిరి, జ‌క్కుల శ్రీ‌నివాస్ యాద‌వ్‌, నాయ‌కులు తాళ్ల‌పెల్లి జ‌నార్ధ‌న్ గౌడ్‌, పులి రజినీకాంత్‌, రామ్మూర్తి, నార్ల‌గిరి ర‌మేష్‌, న‌యీముద్దీన్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>