కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya)పై బీఆర్ఎస్ (BRS) పార్టీ ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తేజస్వీ సూర్య గురువారం తెలంగాణ ఏర్పాటు గురించి పార్లమెంట్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజనను ఇండియా, పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో తేజస్వీ సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) పార్టీ తరఫున ఫిర్యాదు చేశారు.
తేజస్వీ (Tejasvi Surya) తెలంగాణ ఏర్పాటును, ఉద్యమకారుల త్యాగాలను అవమానించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు తేజస్వీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలంతా తేజస్వీ వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు దీనిపై స్పందించాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, బీజేపీ ఎంపీలు తేజస్వీ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయన మాటలను బీఆర్ఎస్ వక్రీకరిస్తోందని ఆరోపించారు.
Read Also: లోక్ సభలో వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు
Follow Us On : WhatsApp

