మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సీఈసీ స్పందన

కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar) స్పందించారు. నామినేషన్ తిరస్కరణ అంశం అనేది పూర్తిగా రిటర్నింగ్ ఆఫీసర్ అధికార పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. ఆ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఆర్వో నిర్ణయాల్లో ఈసీ ప్రమేయం ఉండొద్దని సుప్రీంకోర్ట్ సైతం పలు తీర్పుల్లో వెల్లడించిందన్నారు.

అసలేం జరిగిందంటే..

మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయగా.. అక్కడి రిటర్నింగ్ ఆఫీసర్ దాన్ని తిరస్కరించారు. ఇది దేశ వ్యాప్తంగా పెద్ద దుమారానికి దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మీనాక్షి నటరాజన్ తనపై తెలంగాణలో నమోదైన కేసు విషయాన్ని దాచి ఉంచారని.. ఇది ఎన్నికల నియామవళికి విరుద్ధమని ఆర్వో ప్రకటించారు.

నిబంధనల ప్రకారమే, ఆమె నామినేషన్ తిరస్కరించినట్లు సమర్థించారు. వాస్తవానికి మీనాక్షిపై కేవలం ఫిర్యాదు మాత్రమే వచ్చిందని, కేసే నమోదు కాలేదని తెలంగాణ పీసీసీ ప్రకటించింది.

సుప్రీంకోర్టుకు వెళ్లినా..

కాంగ్రెస్ అభ్యర్థిపై ఈసీ కుట్రపూరితంగా వ్యవహరించి, నామినేషన్ తిరస్కరించేలా చేసిందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్ట్ నిరాకరించడంతో.. మీనాక్షి రాజ్యసభకు ఎన్నిక కాలేకపోయారు. దీనిపై అప్పట్లోనే.. సీఈసీ తీరుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. వాటికి సమాధానమిస్తూ.. తాజాగా జ్ఞానేష్ కుమార్ స్పందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>