బాలికపై లైంగికదాడి కేసు.. కానిస్టేబుల్ అరెస్ట్

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు (Kothagudem Minor Assault Case)లో పోలీసులు మరో కీలకమైన అరెస్ట్ చేశారు. ఈ కేసులో A-6 నిందితుడిగా ఉన్న బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఒక ప్రకటనలో వెల్లడించారు.

​పోలీసుల కథనం ప్రకారం, ప్రధాన నిందితుడు మైనర్ బాలికను కొత్తగూడెం పాత డిపో ప్రాంతంలోని ఒక గదికి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో నిందితులకు ఆ గదిలో ఆశ్రయం కల్పించినందుకు గానూ బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను పోలీసులు ఈ కేసులో A-6 నిందితుడిగా చేర్చారు. ఈ దారుణ ఘటనపై బాధితురాలి తల్లి ఈ నెల 11వ తేదీన కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగానే నేరానికి సహకరించి, ఆశ్రయం కల్పించిన కానిస్టేబుల్ వెంకటేష్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై లోతుగా విచారణ కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>