ఢిల్లీకి BRS బృందం.. ఎందుకంటే?

కలం, వెబ్ డెస్క్: జూలై 15న ఢిల్లీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం (BRS Delegation) వెళ్లనుంది. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునఃప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy)ని కలిసి వినతిపత్రం సమర్పించనుంది. కేటీఆర్, మాజీ మంత్రి జోగు రామన్నల ఆధ్వర్యంలోని సీసీఐ సాధన కమిటీ కేంద్ర మంత్రిని కలిసి పరిశ్రమ పునరుద్ధరణకు సంబంధించి వినతిపత్రాన్ని అందజేయనుంది. ఈ ప్రతినిధి బృందంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్రతో పాటు పలువురు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఉండనున్నారు.

ఆదిలాబాద్ ప్రజల చిరకాల డిమాండ్, జిల్లా యువతకు వేలాది ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం ఉన్న సీసీఐ (Adilabad CCI) పరిశ్రమను కేంద్రం తక్షణమే పునఃప్రారంభించాలని బృందం (BRS Delegation) కోరనుంది. ఈ అంశంపై కుమారస్వామి జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయనుంది. సీసీఐ పునఃప్రారంభంపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునేలా విజ్ఞప్తి చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని బీఆర్ఎస్ పేర్కొంది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి ఈ అంశంపై విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది.

Read Also: కాక రేపుతోన్న వరంగల్ రాజకీయాలు.. హాట్ టాపిక్‌గా మంత్రి ‘చిన్నపులి’ కామెంట్స్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>