Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమ‌ల ల‌డ్డూపై మండ‌లిలో చ‌ర్చించాలి: బొత్స

క‌లం, వెబ్ డెస్క్‌: తిరుమ‌ల ల‌డ్డూ (Tirumala Laddu)లో క‌ల్తీ నెయ్యి అంశంపై శాస‌న మండ‌లి వేదిక‌గా చ‌ర్చించాల‌ని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ (Botsa Satyanarayana) డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రేపు తిరుమ‌ల ల‌డ్డూపై చ‌ర్చ నిర్వ‌హిస్తామ‌ని మంత్రి లోకేశ్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో బొత్స స్పందించారు. అసెంబ్లీలో చ‌ర్చ జ‌రుపుతారా లేదా అన్న‌ది త‌మ‌కు అన‌వ‌స‌రం అని, మండ‌లిలో మాత్రం చ‌ర్చ జ‌ర‌గాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. అలాగా శాస‌న‌ మండ‌లిలో వైసీపీ వాయిదా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఇందాపూర్‌, హెరిటేజ్ సంస్థ‌ల సంబంధాల‌పై చ‌ర్చించాల‌ని వైసీపీ స‌భ్యులు ప‌ట్టుప‌ట్టారు. గ‌త కొద్ది రోజులుగా కోరుతున్నా చ‌ర్చ‌కు నిరాక‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. దీనిపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ చైర్మ‌న్ పోడియాన్ని చుట్టుముట్టారు. చైర్మ‌న్ వైసీపీ వాయిదా తీర్మానాన్ని మ‌ళ్లీ తిర‌స్క‌రించారు. వైసీపీ స‌భ్యులు నినాదాలు చేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో చైర్మ‌న్ స‌భ‌ను వాయిదా వేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>