Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమల క్యూలైన్‌లో భక్తురాలికి పాము కాటు!

క‌లం, వెబ్ డెస్క్‌: తిరుమ‌ల(Tirumala)లో వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నం కోసం క్యూలో ఉన్న‌ ఓ భ‌క్తురాలిని పాము కాటు వేయ‌డం క‌ల‌క‌లం రేపింది. సోమ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. భూపాల‌ప‌ల్లికి చెందిన మౌనిక రూ.300 ప్ర‌త్యేక ద‌ర్శ‌నం క్యూలైన్‌లో ఉంది. భ‌క్తుల ర‌ద్దీ ఉండ‌టంతో కింద వెళ్తున్న పామును ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు. ఆ పాము మౌనిక‌ను కాటు వేసింది. మౌనిక వెంట‌నే గుర్తించి త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు విష‌యాన్ని చెప్పింది. దీంతో ఆమెను తిరుప‌తిలోని అశ్విని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ప్ర‌థ‌మ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మ‌రో ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>