కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఇటీవలే నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి, తనకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మున్నూరు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి, కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలను పేదలకు అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి సూచించారు.

