epaper
Wednesday, February 18, 2026
epaper

తెలుగు రాష్ట్రాల్లో కోర్టుల‌కు బాంబు బెదిరింపులు!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు కోర్టుల‌(Courts)కు బాంబు బెదిరింపు (Bomb Threat) రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి (Nampally)లో ఉన్న సీబీఐ కోర్టు, క‌రీంన‌గ‌ర్ (Karimnagar), రాజ‌మండ్రి (Rajahmundry) జిల్లా కోర్టుల‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వ‌చ్చాయి. దీంతో న్యాయ‌వాదులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆయా కోర్టుల ఆవ‌ర‌ణ‌లో క్లూస్ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వ‌హిస్తున్నారు. న్యాయ‌వాదుల‌ను సిబ్బందిని కోర్టుల్లో నుంచి బ‌య‌ట‌కు పంపించేశారు. క‌రీంన‌గ‌ర్ కోర్టులో 12 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. దీంతో న్యాయ‌వాదులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. నాంప‌ల్లి కోర్టుకు గ‌తంలో సైతం బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం మూడు న్యాయ‌స్థానాల్లో త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. ఒకేసారి మూడు కోర్టుల‌కు బాంబు బెదిరింపు రావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>