‘శుభలగ్నం’ సీన్​ రిపీట్​.. భర్తను అమ్మేసిన భార్య !

కలం, వెబ్​ డెస్క్​ : సినిమా స్టోరీని తలపించేలా భోపాల్‌లో (Bhopal) ఒక వింత ఘటన చోటుచేసుకుంది. 1994లో వచ్చిన శుభలగ్నం సినిమాలో ఆస్తి కోసం భార్య తన భర్తను మరో మహిళకు అమ్మేసినట్లుగానే, ఇక్కడ కూడా ఒక మహిళ తన భర్తను వదిలేయడానికి భారీ డీల్ కుదుర్చుకుంది.

వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌ (Bhopal)కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఒక 52 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న భార్య కుటుంబ కలహాల నేపథ్యంలో కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి కలపాలని ప్రయత్నించింది. భర్త మాత్రం తన ప్రియురాలితోనే ఉంటానని, భార్యతో కలిసి ఉండటం తనకు ఇష్టం లేదని చెప్పేశాడు.

భర్త ధోరణిని గమనించిన భార్య కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తన భర్తను శాశ్వతంగా వదిలేయడానికి ఆమె భారీ డీల్ కుదుర్చుకుంది. తనకు 1.77 కోట్ల రూపాయల నగదుతో పాటు, ఒక ఇల్లు ఇస్తే అతన్ని వదిలేస్తానని కండిషన్ పెట్టింది. భర్త ఈ షరతులన్నింటికీ అంగీకరించాడు. వీరి ఈ ఒప్పందాన్ని కోర్టు కూడా అధికారికంగా ధ్రువీకరించడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: అది అత్యాచారయత్నమే : సుప్రీం కోర్టు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>