కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన ప్రముఖ పర్యాటక ప్రాంతం బొగత జలపాతం (Bogatha Waterfall) సరికొత్త జలకళను సంతరించుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న ఈ జలపాతం గత కొన్ని నెలలుగా నీరు లేక పూర్తిగా బోసిపోయింది. తాజాగా ఎగువ ప్రాంతాలైన ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పూర్వ వైభవాన్ని దక్కించుకుంది. ఎగువ ప్రాంతాల నుండి ఉప్పొంగుతున్న నీటి ప్రవాహంతో బొగత జలపాతం ప్రస్తుతం ఉరకలెత్తుతోంది.
కొండకోనలు, దట్టమైన అడవుల మధ్య పాలనురగలను తలపిస్తూ ఉధృతంగా దుముకుతున్న ఈ జలధారలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎండకాలంలో వెలవెలబోయిన ఈ ప్రాంతం ఇప్పుడు ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జలపాతం (Bogatha Waterfall) ఉరకలెత్తుతున్న ఈ ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుండి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
పర్యాటకులకు పండగే.. ‘బొగత’లో జలకళ!
Bogatha Waterfall Comes Alive Again—A Perfect Monsoon Getaway!#BogathaWaterfall #TelanganaNiagara #Mulugu #Kalam #KalamDaily #KalamPaper pic.twitter.com/2VxY33sz8J— Kalam Daily (@kalamtelugu) July 2, 2026
Read Also: తెలంగాణ – కర్నాటక.. బోర్డర్లో ‘చెత్త’ పంచాయితీ!
Follow Us On : WhatsApp

