బోధన్ లో హంగ్.. హస్తానికి పతంగ్ ఆపన్న హస్తం అందించేనా?

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ (Bodhan Municipality) లో హంగ్ ఏర్పడింది. నిజామాబాద్ కార్పొరేషన్ తో జిల్లాలో పాటు మూడు మున్సిపాలిటీలు బోధన్, ఆర్మూర్, భీం గల్ మున్సిపాలిటీలున్నాయి. ఆర్మూర్, భీం గల్ లలో అధికార కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. బోధన్ లో మాత్రం ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులున్నాయి. కాంగ్రెస్ కు 17 సీట్లు రాగా రెండో స్థానంలో ఎంఐఎం 12 స్థానాలు సాధించింది. బీఆర్ఎస్ 5, బీజేపీ 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.

ఇక్కడ (Bodhan Municipality) ఎంఐఎం (MIM).. కారు పార్టీతో స్నేహం చేసిందనీ ప్రచారం జరిగింది. కానీ, అధికార కాంగ్రెస్ కే ఇప్పుడు ఎక్కువ స్థానాలు రావడంతో పెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో పతంగ్ పార్టీ కీలకంగా మారింది. కాంగ్రెస్ కు ఆపన్నహస్తం అందిస్తే రెండు పార్టీలు కలిసి చైర్మన్, వైస్ పీఠాలు పంచుకునే అవకాశాలున్నాయి. కానీ ఆదినుంచి చైర్మన్ పదవిని ఎంఐఎం ఆశిస్తోంది. ఇపుడు అదే డిమాండ్ ను కాంగ్రెస్ ముందుంచే అవకాశం ఉంది. అలాగైతేనే మద్దతు ఇచ్చే పరిస్థితులున్నాయి. అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా ఎక్కువ స్థానాలు సాధించినందున చైర్మన్ స్థానం కోరుకుంటుంది. ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరితే ఏదైనా సాధ్యమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also: ప్రజా పాలనకు ప్రజలు పట్టం.. మున్సిపల్​ ఫలితాలపై భట్టి స్పందన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>