పాల్వంచలో క్షుద్రపూజల కలకలం.. స్కూల్ ఎదుటే..

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) మండలం రంగాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఎదురుగా క్షుద్ర పూజల ఆనవాలు స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం స్కూలు కు వచ్చిన విద్యార్థులు స్కూల్ గేటు ఎదురుగా ఉన్న రోడ్డుపై పసుపు, కుంకుమ, అన్నం ముద్దలు, ముగ్గు, కొబ్బరికాయ, నిమ్మకాయలు, బొగ్గులు అలంకరించి వుండడం చూసి భయబ్రాంతులకు గురి అయ్యారు.

విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లి తండ్రులు కొందరు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి విద్యార్థులకు దైర్యం చెప్పారు. ఆదివారం అర్దరాత్రి క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లనే, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని.. స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రహరీ గోడ, లైట్లు, పటిష్టమైన గేటు ఏర్పాటు చేస్తే ఇలాంటి సంఘటనలు నివారించవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>