Mobile Popup Ad
Mobile Popup Ad

మోదీ నాయకత్వం యువత భవిష్యత్తుకు భరోసా : బండ కార్తీక రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో : ఇందూరు నగరంలోని దుబ్బ మేరు సంఘం భవనంలో భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో “నమో GEN Z యువ సమ్మేళనం” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండ కార్తీక రెడ్డి, దినేష్ పటేల్ కులాచారి, గోపిడి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సతీష్ రెడ్డి సభకు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా బండ కార్తీక రెడ్డి మాట్లాడుతూ, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో యువతకు ఎన్నో అవకాశాలు కల్పించబడినట్లు తెలిపారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ప్రధాన్ మంత్రి ముద్ర యోజన, PM ఇంటర్న్‌షిప్, ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు ఉపాధి, స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తరించాయని పేర్కొన్నారు.

దినేష్ పటేల్ కులాచారి (Dinesh Kulachari) మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం యువత శక్తిని దేశ అభివృద్ధికి ఉపయోగించుకుంటూ ప్రపంచంలోనే భారత యువతకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం (BJYM) తెలంగాణ రాష్ట్ర కో కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు స్వామి యాదవ్, నారాయణ యాదవ్, బీజేవైఎం నాయకులు వీపుల్ రావు, వినోద్ రెడ్డి, రాజ్ గణేష్, రాజశేఖర్, గౌతమ్ బీజేవైఎం నాయకులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: ప్రధాని మోదీకి సీజేపీ బహిరంగ లేఖ.. రేపటి నుంచి భారీ నిరసన!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>