ధాన్యం నిల్వకు సహకరిస్తాం: మంత్రి ఉత్తమ్

కలం, తెలంగాణ బ్యూరో: వరి ఉత్పత్తికి అనుగుణంగా ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పేర్కొన్నారు. సోమవారం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) జనరల్ మేనేజర్ అనూజ్ త్యాగి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ధాన్యం సేకరణ, నిల్వ సదుపాయాల విస్తరణ, రవాణా వ్యవస్థ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ఎఫ్ సీఐ అధికారులు పలు ప్రతిపాదనలు తీసుకొచ్చారు.

రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు మంత్రికి వివరించారు. ఎఫ్‌సీఐ చేపట్టే విస్తరణ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. సంబంధిత శాఖల సమన్వయం, అవసరమైన అనుమతుల సాధనతోపాటు అదనపు నిల్వ సదుపాయాల ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు.

ఎఫ్ సీఐతో సమన్వయం అవసరం

–ధాన్యం సేకరణ, నిల్వ నిర్వహణ, లాజిస్టిక్స్ వ్యవస్థల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం-ఎఫ్‌సీఐ మధ్య సమన్వయం అవసరమని ఉత్తమ్ అన్నారు.
–2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో తెలంగాణ దేశంలో రెండో అతిపెద్ద వరి సేకరణ రాష్ట్రంగా నిలిచిందన్నారు.
–రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరుగుతున్నప్పటికీ, ఎఫ్‌సీఐ నిల్వ సామర్థ్యం 31 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్‌ఎంటీ) మాత్రమే ఉంది. ఇంకో16.25 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం లోటు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>